Anantapur: రికార్డు స్థాయిలో 5.2 కిలోల బరువుతో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో రికార్డు స్థాయిలో 5.2 కిలోల బరువుతో ఓ మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. 30 ఏళ్ల తల్లికి అనేక

By అంజి  Published on  16 Jun 2023 3:50 AM GMT
Anantapur woman, 5.2 kg baby boy, record weight , APnews

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో రికార్డు స్థాయిలో 5.2 కిలోల బరువుతో ఓ మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. 30 ఏళ్ల తల్లికి అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అయితే వైద్యులు అనేక సవాళ్ల మధ్య విజయవంతంగా సి-సెక్షన్ ఆపరేషన్‌ నిర్వహించారు. సాధారణంగా, నవజాత భారతీయ శిశువులు 2.5 నుండి 4 కిలోల బరువు కలిగి ఉంటారు. సగటు బరువు 3 నుండి 3.5 కిలోలు మాత్రమే.

నాలుగు కిలోల కంటే ఎక్కువ బరువున్న ఇటువంటి భారీ లేదా అధిక బరువు గల పిల్లలు, మాక్రోసోమియా (పెద్ద శరీరం యొక్క గ్రీకు పదం) అనే పరిస్థితిని కలిగి ఉంటారు. గర్భధారణ మధుమేహం, స్థూలకాయం, ఓవర్‌ డ్యూ ప్రెగ్నెన్సీ, అధిక తల్లి, తండ్రి వయస్సు (35 సంవత్సరాల కంటే ఎక్కువ) ఉన్న తల్లులు అటువంటి అధిక బరువు గల శిశువులకు జన్మనివ్వడానికి ప్రమాద కారకాలు అని వైద్యులు అంటున్నారు.

అనంతపురంలోని కిమ్స్ సవీరా హాస్పిటల్‌లోని కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ శిల్పా చౌదరి ఈ కేసు గురించి వివరిస్తూ.. ''ధర్మవరానికి చెందిన 30 ఏళ్ల మహిళ అధిక ఉమ్మనీరు, కడుపు వాపు, అధిక రక్తపోటుతో ఆస్పత్రికి వచ్చింది. మేము అల్ట్రాసౌండ్ స్కాన్ తీసుకున్నప్పుడు, గర్భిణీ శిశువు యొక్క బరువు, ఉమ్మనీరు కొలత చాలా ఎక్కువగా ఉంది. సాధారణంగా, ద్రవ స్థాయి ఐదు సెం.మీ. కానీ ఈ మహిళకు 28 సెం.మీ. ఉంది. హైరిస్క్ కేసు కావడంతో వెంటనే ఆమెను అడ్మిట్ చేసి వైద్య పరీక్షలు నిర్వహించాం. సాధారణంగా గర్భిణీ స్త్రీల పొట్ట 36 అంగుళాలు ఉంటుంది. కానీ ఆమె విషయంలో అధిక ఉమ్మనీరు, గర్భిణీ బిడ్డ బరువు కారణంగా ఆమెకు 48 అంగుళాల పొట్ట ఉంది. కాబట్టి, అనస్థీషియా ఇవ్వడం కూడా మా బృందానికి పెద్ద సవాలుగా మారింది. ఐదవ నెల తర్వాత ఆమె ఎలాంటి స్కానింగ్ చేయించుకోలేదు'' అని తెలిపారు.

"గర్భిణీ స్త్రీకి ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు కూడా అధిక బరువు కలిగి ఉన్నారు (వరుసగా 3.7 మరియు 4.5 కిలోలు). మునుపటి రెండు డెలివరీల సమయంలో ఆమెకు సి-సెక్షన్లు జరిగాయి. కాబట్టి, ఇప్పుడు కూడా, ఆమె అధిక-ప్రమాదకర పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, మేము అదే విధానాన్ని ఎంచుకున్నాము. ఆమెకు మొదటి గర్భంలోనే రక్తపోటు, మధుమేహం ఉన్నాయి. ఈసారి కూడా, ఆమె డెలివరీ కోసం మా వద్దకు వచ్చినప్పుడు, ఆమె ప్రాణాపాయ స్థితి ఎక్కువుగా ఉంది. కాబట్టి, ఈ కేసు సంక్లిష్టత కారణంగా మేము సి-సెక్షన్‌ను చాలా జాగ్రత్తగా నిర్వహించాల్సి వచ్చింది'' అని డాక్టర్ శిల్ప తెలిపారు.

“మగ శిశువును 10 రోజుల పాటు నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU)లో ఉంచి పరిశీలించారు. డిశ్చార్జ్ సమయంలో తల్లి, బిడ్డ ఇద్దరూ మంచి ఆరోగ్యంతో ఉన్నారు. అయితే ఇలాంటి అధిక బరువు గల శిశువులకు భవిష్యత్తులో ఊబకాయం, మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని మేము వారికి సూచించాము”అని డాక్టర్ శిల్పా అన్నారు.

చాలా ఎక్కువ బరువున్న పిల్లలు

- రికార్డుల ప్రకారం, ప్రపంచంలోనే అత్యంత బరువైన శిశువు 1955 సంవత్సరంలో ఇటలీకి చెందినది, 10.2 కిలోల బరువున్న మగ శిశువు.

- భారతదేశంలో, ఇప్పటివరకు రికార్డులో ఉన్న అత్యంత బరువైన శిశువు 6.8 కిలోల బరువు, కర్ణాటకకు చెందిన ఒక అమ్మాయి, మే 2016లో జన్మించింది.

- నవంబర్ 2015లో జన్మించిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరో మగబిడ్డ 6.7 కిలోల బరువుతో దేశంలోనే రెండవ అత్యంత అధిక బరువు కలిగిన నవజాత శిశువుగా నిలిచాడు.

Next Story