ఫార్ములా కోసం ఒత్తిడి.. హైకోర్టులో వ్యాజ్యం

Anandaiah filed petiton in high court. ఆనంద‌య్య త‌రుపున అడ్వ‌కేట్ ఎన్‌.అశ్వనీకుమార్ ఈ పిటిష‌న్ వేశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 May 2021 6:53 AM GMT
Anadaiah petition in HC

నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నంకు చెందిన ఆనంద‌య్య క‌రోనా రోగుల‌కు స్వ‌స్థ‌త చేకూర్చేందుకు ఆయుర్వేద‌ మందు ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా.. తాను త‌యారు చేసిన ఆయుర్వేద ఔష‌ధ ప‌దార్థాలు, ఫార్ములా వివ‌రాల‌ను చెప్పాల‌ని అధికారులు వేదిస్తున్నార‌ని ఆనంద‌య్య గురువారం హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. మందు పంపిణీ విషయంలో జోక్యం చేసుకోకుండా అధికారులను ఆదేశించాలని కోరారు. ఆనంద‌య్య త‌రుపున అడ్వ‌కేట్ ఎన్‌.అశ్వనీకుమార్ ఈ పిటిష‌న్ వేశారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఉచితంగా మందు పంపిణీ చేస్తున్నానని, ఈ కార్యక్రమానికి రక్షణ కల్పించేలా ఆదేశించాలన్నారు.

లోకాయుక్త ఆదేశాల మేరకు మందు విషయంలో వాస్తవాలు తేల్చేందుకు నెల్లూరు జిల్లా కలెక్టర్‌ త్రిసభ్య కమిటీ వేశారు. కమిటీ ఆయుష్‌ కమిషనర్‌తో వచ్చి నమూనాలు సేకరించింది. మందుపై ప్ర‌జ‌లు ఎవ‌రూ కూడా నెగెటివ్‌గా చెప్ప‌డం లేద‌ని నివేదిక‌లో పేర్కొన్నారు. మందు తయారీకి వాడే ఫార్ములా చెప్పాలని త్రిసభ్య కమిటీ సభ్యులతో పాటు ఆయుష్‌ కమిషనర్‌ ఒత్తిడి చేస్తున్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో భారీగా ఖర్చు చేయలేని సామాన్య ప్రజలను నా మందు ఆకర్షించింది. ప్రస్తుతం నేను మందును ఉచితంగా పంపిణీ చేస్తున్నాను. అయితే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు, అధికార యంత్రాంగం కలిసి దీన్ని వ్యాపార ప్ర‌యోజ‌నాల కోసం వాడుకుంటారేమోన‌న్న ఆందోళ‌న క‌లుగుతోంది. అని ఆనంద‌య్య త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు.


Next Story