కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందుకు ప్రభుత్వం ఓకె చెప్పినట్లేనా..

Anandaiah Corona Medicine. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సమీక్ష సమావేశంలోనూ ఆనందయ్య ఆయుర్వేద మందు చర్చించారు.

By Medi Samrat  Published on  21 May 2021 11:36 AM GMT
AP Govt ok to Anandaiah Corona Medicin

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య అనే వ్యక్తి ఇచ్చే ఆయుర్వేద మందు గురించే గత కొద్దిరోజులుగా చర్చించుకుంటూ ఉన్న సంగతి తెలిసిందే..! ఇది మీడియా ద్వారా దేశ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సమీక్ష సమావేశంలోనూ చర్చించారు. దీనికి అనుమతి ఇచ్చే విషయంపై ఆయన అధికారులతో చర్చించారు. ముందుగా ఆ ఔషధం శాస్త్రీయతను నిర్ధారణ చేయించాల్సిన అవసరం ఉందని జగన్ అభిప్రాయపడ్డారని తెలుస్తోంది. నెల్లూరుకు వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలతో కూడిన ఐసీఎంఆర్ బృందాన్ని పంపించాలని ఆదేశించారు. ఆయుర్వేద మందు గుణగణాలపై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని అధికారులకు నిర్దేశించారు. ఆ తర్వాతనే దానిపై నిర్ణయం ఉండబోతోంది.

కరోనాను పారదోలుతుందని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు అక్కడి వాళ్లు. పక్క రాష్ట్రాల నుండి కూడా ఆ మందు కోసం తరలివస్తున్నారు. వేలమంది ఆనందయ్య కరోనా మందు కోసం బారులుతీరుతున్నారు. వేల మందికి ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ చేశారని, ఎక్కడా సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి హామీ ఇవ్వడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మందు అద్భుతంగా పనిచేస్తుందని కరోనా బాధితులు చెబుతున్నారన్నారు. వేల మంది రావడం వల్ల ఇబ్బంది కలుగుతోందని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కరోనా మందు కోసం ఎవరూ రావద్దని ఎమ్మెల్యే కాకాని అన్నారు. వేల మంది రావడం వల్ల పోలీసులు కూడా నియంత్రించలేని పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఈరోజు సాయంత్రానికి ఆయుష్ అనుమతులు కూడా వస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు. ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ప్రభుత్వ అనుమతులు, క్లీన్ చిట్ వస్తే ఇతర రాష్ట్రాల వారికి కొరియర్ చార్జీలు కూడా తామే భరించి మందులు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే కాకాని హామీ ఇచ్చారు.

ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందు పంపిణీ ప్రాంతం వద్ద పరిస్థితి అదుపు చేయడం పోలీసులకు కూడా కష్టతరంగా మారుతోంది ప్రస్తుతం అక్కడ 5 వేల మందికి మందు తయారు చేసినప్పటికీ.. అక్కడ ఉన్న జనం 35 వేల మందికి పైగానే ఉన్నారు. పాజిటివ్ వచ్చిన వాళ్లు ఎక్కువగా ఉన్నారు. అంబులెన్స్ లు 2 వేలు వరుసగా ఉన్నాయని తెలుస్తోంది. ఆనంద్ ఆయుర్వేద మందు పంపిణీ వద్ద గందరగోళం, తోపులాట జరిగింది. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.


Next Story
Share it