అమిత్ షా తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలి : వైఎస్ షర్మిల

బాబాసాహెబ్ అంబేద్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనం.. భారత రాజ్యాంగానికి ఇది ఘోర అవమానం అని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

By Kalasani Durgapraveen  Published on  19 Dec 2024 12:00 PM IST
అమిత్ షా తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలి : వైఎస్ షర్మిల

బాబాసాహెబ్ అంబేద్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనం.. భారత రాజ్యాంగానికి ఇది ఘోర అవమానం అని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ ప్రజల మనోభావాలు తీవ్రంగా దెబ్బతీసినట్లేన‌న్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతిని.. అమలు చేసేందుకు సంఘ్ పరివార్ కుట్రలో భాగమే ఇదంతా.. మనుస్మృతిని బీజేపీ విశ్వసిస్తుంది కాబట్టే అనుక్షణం రాజ్యాంగంపై దాడి చేస్తోందన్నారు.

బీజేపీ రాజ్యాంగ నిర్మాతను ప్రతి సారి హేళన చేస్తోందన్నారు. మన రాజ్యాంగం మీద, మన జాతీయ జెండా మీద బీజేపీకి గౌరవం లేదని మరోసారి నిరూపితం అయ్యిందన్నారు. అంబేద్కర్ ను అవమానించినందుకు అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పాలి.. మంత్రి పదవికి తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా AICC పిలుపు మేరకు ఇవ్వాళ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం చేయాలని శ్రేణుల‌కు సూచించారు.

Next Story