అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్.. రెండు కాళ్లు వెడల్పు చేశారు

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనపై రెండుకేసులు నమోదు కాగా ఒక్క...

By -  అంజి
Published on : 2 Feb 2026 10:57 AM IST

Ambati Rambabu, remand, judicial custody, APnews

అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్.. రెండు కాళ్లు వెడల్పు చేశారు

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనపై రెండుకేసులు నమోదు కాగా ఒక్క కేసులో రిమాండ్ విధించింది. మరోకేసులో 41ఏ నోటీసులిచ్చి విచారించాలని తెలిపింది. ఆయన తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అంబటిపై పెట్టిన కేసులన్నీ ఏడేళ్ల శిక్షకు సంబంధించినవేని సుధాకర్ రెడ్డి అన్నారు. 41ఏ కింద నోటీసులు ఇవ్వలేదన్నారు.

అంబటి పై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ చెల్లదని కేవలం ఉన్నతాధికారుల అనుమతితోనే ఏఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సుధాకర్ రెడ్డి కోర్టు ముందు వాదించారు. ఇక అంబటి రాంబాబు గుంటూరు మేజిస్ట్రేట్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు తనను శారీరకంగా నన్ను ఇ‍బ్బందిపెట్టారని, రెండు కాళ్లు వెడల్పు చేశారు. తన కాళ్లు నొప్పిపెడుతున్నాయన్నారు. నల్లపాడు సీఐతో పాటు మరో ఇద్దరు సీఐలు తనను వేధించారన్నారు. తనపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు తీసుకోలేదని జడ్జి ముందు ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story