ఆర్కే సీఎం వెంటే నడుస్తాడు : ఎంపీ అయోధ్య రామిరెడ్డి

వ్యక్తిగత కారణం వలనే ఆర్కే రాజకీయాలకు దూరం ఉండాలని అనుకున్నారని ఆయ‌న సోద‌రుడు, ఎంపీ అయోధ్య రామిరెడ్డి తెలిపారు.

By Medi Samrat  Published on  11 Dec 2023 8:50 PM IST
ఆర్కే సీఎం వెంటే నడుస్తాడు : ఎంపీ అయోధ్య రామిరెడ్డి

వ్యక్తిగత కారణం వలనే ఆర్కే రాజకీయాలకు దూరం ఉండాలని అనుకున్నారని ఆయ‌న సోద‌రుడు, ఎంపీ అయోధ్య రామిరెడ్డి తెలిపారు. సీఎం క్యాంప్ ఆఫీస్ వ‌ద్ద ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. రెండుసార్లు ఎమ్మెల్యేగాఆర్కే బాగా పనిచేసారని అన్నారు. మంగళగిరి నియోజకవర్గం మొదట నుండి బీసీ సామాజిక వర్గం వాళ్ళకి ఇవ్వాలని సీఎం జగన్ అనుకున్నారు. అందుకే గంజి చిరంజీవిని ఇంచార్జ్ గా ప్రకటిస్తున్నామని వివ‌రించారు. అసంతృప్తి అనేది ఆర్కేకు లేదు.. ఆర్కే మంగళగిరిని బాగా అభివృద్ధి చేసాడ‌ని అన్నారు.

రాజకీయ సమీకరణం వలనే ఇక్కడ మార్చడం జరిగిందని తెలిపారు. ఆర్కే సీఎం వెంటే నడుస్తాడని ఆశభావం వ్యక్తం చేస్తున్నాను. రాజకీయంగా ఆర్కేకు కొన్ని అంచనాలు ఉన్నాయి. అవి రిచ్ అవ్వలేకేనే రాజకీయంగా దూరంగా ఉండాలని అనుకున్నారని.. ఆలోచన చేసే ఆర్కే ఈ నిర్ణయం తీసుకున్నారని అనుకుంటున్నానని పేర్కొన్నారు. మళ్ళీ మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ గెలుస్తుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు. 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా పని చేశా అని ఆర్కే సంతృప్తిగా ఉన్నారని తెలిపారు.

Next Story