విద్యాశాఖ కీలక నిర్ణయం.. 'నో ఫోన్‌' జోన్లుగా ప‌దోత‌ర‌గ‌తి పరీక్షా కేంద్రాలు

All examination centres declared No-phone Zones in AP.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు జ‌రుగుతున్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 May 2022 8:24 AM IST
విద్యాశాఖ కీలక నిర్ణయం.. నో ఫోన్‌ జోన్లుగా ప‌దోత‌ర‌గ‌తి పరీక్షా కేంద్రాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ప‌రీక్ష‌లు ప్రారంభ‌మైన నాటి నుంచి ఎక్క‌డో ఒక చోట ప్ర‌శ్నా ప‌త్రాల లీకేజ్ కి సంబంధించిన వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో పేప‌ర్ లీక్‌, మాస్ కాపీయింగ్ లాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా ఉండేందుకు పాఠ‌శాల విద్యాశాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అధ్యాప‌క, సిబ్బంది టెక్నాల‌జీ వినియోగం పై మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది.

పదో తరగతి పరీక్షలు జరుగుతున్న అన్ని కేంద్రాలను పాఠశాల విద్యాశాఖ 'నో ఫోన్‌' జోన్లుగా ప్రకటించింది. పాఠశాల చీఫ్ సూపరింటెండెంట్ల ఫోన్‌లను కూడా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేందుకు నిరాకరించింది. పరీక్ష విధుల్లో ఉన్న ఇన్విజిలేట‌ర్లు, డిపార్ట్‌మెంట్ అధికారుల‌తో పాటు ఇత‌ర నాన్ టీచింగ్ స్టాఫ్ సెల్‌ఫోన్లు తీసుకురాకూడ‌దు. స్మార్ట్‌వాచ్‌లు, డిజిట‌ల్ వాచీలు, కెమెరాలు, బ్లూ టూత్ వంటి ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాలు పరీక్షా కేంద్రంలోకి అనుమ‌తించ‌ర‌ని అధికారులు తెలిపారు.

ప్ర‌శ్నాప‌త్రంలోని అన్ని ప్రతి పేజీ మీద సెంటర్ నెంబర్, రోల్ నెంబర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇన్విజిలెటర్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రశ్నాపత్రాలు ఇవ్వగానే అభ్యర్థులతో సెంటర్ నెంబర్, రోల్ నెంబర్ రాయించాలని సూచించింది. పరీక్ష నిర్వహణలో ఎవరైనా తప్పిదాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

Next Story