రైతులకు అలర్ట్‌.. నేటి నుంచి ఈ-పంట నమోదు

రబీ సీజన్‌కు సంబంధించి సాగు చేసిన ప్రతి పైరునై నమోదు చేసే ఈ - పంట కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15 వరకు పంటల బీమా నమోదు కొనసాగనుంది.

By అంజి  Published on  15 Nov 2024 2:12 AM GMT
AP farmers, E-crop registration, APnews

రైతులకు అలర్ట్‌.. నేటి నుంచి ఈ-పంట నమోదు

అమరావతి: రబీ సీజన్‌కు సంబంధించి సాగు చేసిన ప్రతి పైరునై నమోదు చేసే ఈ - పంట కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15 వరకు పంటల బీమా నమోదు కొనసాగనుంది. ఈ విషయాన్ని గమనించి ప్రతీ రైతు పంట నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ - పంట నమోదు కింద రైతులే స్వయంగా పంట బీమా ప్రీమియం చెల్లించాలని అధికారులు చెబుతున్నారు.

జియో ఫెన్సింగ్‌ ద్వారా గరిష్ఠ నిడివి 50 మీటర్లలోపు పంట వివరాలను నమోదు చేయాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ ఢిల్లీరావు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి 15 నాటికి జాబితాను రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించాలన్నారు. ఏవైనా ప్రభుత్వ పరిహారాలు అందాలంటే ఇందులో నమోదు చేసుకోవడం తప్పనిసరి. లేకపోతే పంట పరిహారం రావడం కష్టమవుతుందని అధికారులు అంటున్నారు.

Next Story