ఏపీలో ఇటీవల ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ఫీజు చెల్లించడానికి రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు ఏప్రిల్ 22 వరకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. పేపర్ల సంఖ్యతో నిమిత్తం లేకుండా మొదటి లేదా రెండో ఏడాదికి రూ.600, ప్రాక్టికల్స్‌కి రూ.275 చెల్లించాలి. బ్రిడ్జి కోర్సుకు రూ.165, బ్రిడ్జికోర్సు ప్రాక్టికల్స్‌కు రూ.275 చెల్లించాల్సి ఉంటుంది. జవాబు పత్రాల రీ వెరిఫికేషన్‌కు రూ.1300, రీ కౌంటింగ్‌కు రూ.260 ఫీజు చెల్లించాలి.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 12నుంచి 20 వరకు జరగనున్నాయి. రెండు సెషన్లలో పరీక్షలు జరగనుండగా.. ఉదయం సెషన్‌లో 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్ ఇయర్, మధ్యాహ్నం సెషన్ 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.
మే 12న సెకండ్ లాంగ్వేజ్, మే 13న ఇంగ్లిష్, మే 14న మ్యాథ్స్ ఏ, బోటనీ, సివిక్స్, మే 15న మ్యాథ్స్ బీ, జవాలజీ, హిస్టరీ, మే 16న ఫిజిక్స్, ఎకనామిక్స్, మే 17న కెమిస్ట్రీ, కామర్స్, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్, మే 19న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్, మే 20న మోడర్న్ లాంగ్వేజ్, జియోగ్రఫీ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మే 28 నుంచి జూన్ 1 వరకు రెండు సెషన్స్‌లో జరుగుతాయి. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ ఎగ్జామ్ జూన్4న, ఎన్విరాన్‌మెంటర్ ఎడ్యకేషన్ ఎగ్జామినేషన్ జూన్ 6న నిర్వహిస్తారు.