కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యంలో తృటిలో ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్ర‌మాదం త‌ప్పింది. దోహ నుంచి గ‌న్న‌వ‌రానికి వ‌స్తున్న విమానం ల్యాండింగ్ స‌మ‌యంలో అదుపుత‌ప్పి ర‌న్ వే ప‌క్క‌నే ఉన్న కరెంట్ స్తంభాన్ని విమానం రెక్క ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో విమానం రెక్క దెబ్బ‌తింది. ఆ స‌మ‌యంలో విమానంలో 64 ప్ర‌యాణీకులు ఉన్నారు. ఈఘటనతో ఫ్రయాణికులు అందరూ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. విమానం రెక్క స్తంభానికి ఢీ కొట్టటంతో అరుపులుకేకలు వేశారు.


అదృష్టవశాత్తు ఇంకా ఎటువంటి ప్రమాదం జరగకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు. అప్రమత్తమైన గన్నవరం ఏయిర్‌పోర్టు అథారిటీ సిబ్బంది ప్రయాణికులను సురక్షితంగా కిందికి దింపేశారు. 63 మంది ప్రయాణికుల్లో గన్నవరంలో 19 మంది ప్రయాణికులు దిగారు. మిగిలిన 45 మంది ప్రయాణికులు తిరుచ్చానూరు వెళ్లాల్సి ఉంది. ల్యాండింగ్ స‌మ‌యంలో ఒరిగిపోయిన విద్యుత్ స్తంభాన్ని తాకిందా..? ఎలా జ‌రిగింద‌నే దానిపై అధికారులు విచార‌ణ చేప‌ట్టారు.
తోట‌ వంశీ కుమార్‌

Next Story