ఏపీ: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా విజయవాడలోని ఏసీబీ కోర్టుకు చేరుకున్నారు. చంద్రబాబుకు బెయిల్ కోరుతూ ఆయన పిటిషన్ వేయనున్నారు. ఆయన దాఖలు చేసే పిటిషన్‌పై కాసేపట్లో విచారణ జరిగే అవకాశము ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. టీడీపీ జాతీయ అద్యక్షుడు నారా చంద్రబాబు అరెస్ట్ పై టిడిపి శ్రేణులు తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ పై తెలంగాణ టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. చంద్రబాబును అరెస్టు చేసిన కారణంగా టిడిపి నేతలు, కార్యకర్తలు ఏపీ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎక్కడికక్కడ ఆ పార్టీ కార్యకర్తలు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు.
ఆర్టీసీ బస్టాండ్లు, పలు కూడళ్లలో ఆందోళనకు దిగారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులను పోలీసుల అదుపులోకి తీసుకుని పీఎస్‌లకు తరలిస్తున్నారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. మరోవైపు టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలో పార్టీ నేతలు గవర్నర్‌ను కలిశారు. ఇదిలా ఉండగా అటు ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇటు తెలంగాణలోని హైదరాబాదులో చంద్రబాబు అరెస్ట్‌ని నిరసిస్తూ ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకున్నారు. టీడీపీ నేతలు కార్యకర్తలు భారీ ఎత్తున ఎన్టీఆర్ ట్రస్ట్ వద్దకు చేరుకోవడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై అక్కడ భారీగా మోహరించారు.