ఏపీకి భారీ విరాళం అందించిన అదానీ గ్రూప్

ఆంధ్రప్రదేశ్‌లో వరద సహాయక చర్యలకు మద్దతుగా అదానీ గ్రూప్ భారీ విరాళాన్ని అందించింది

By Medi Samrat
Published on : 19 Sept 2024 7:38 PM IST

ఏపీకి భారీ విరాళం అందించిన అదానీ గ్రూప్

ఆంధ్రప్రదేశ్‌లో వరద సహాయక చర్యలకు మద్దతుగా అదానీ గ్రూప్ భారీ విరాళాన్ని అందించింది. 25 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చింది. ఈ నెల ప్రారంభంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, నదులు పొంగిపొర్లడం వల్ల ఏపీలోని అనేక ప్రాంతాలు వరదలకు గురయ్యాయి. ఏపీకి సాయం అందించడానికి పలు సంస్థలు, ప్రముఖులు ముందుకు వచ్చాయి. అదానీ సంస్థ కూడా భారీ విరాళాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అందించింది.

"ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కుండపోత వర్షాలు, వరదల కారణంగా సంభవించిన అపారమైన నష్టంతో తీవ్రంగా కలత చెందాం. అదానీ గ్రూప్ ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు సంఘీభావంగా నిలుస్తుంది. సహాయంలో భాగంగా 25 కోట్ల రూపాయలను అదానీ ఫౌండేషన్ అందిస్తోంది" అని అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 25 కోట్ల చెక్కును అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ సీఈఓ కరణ్ అదానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు.

Next Story