ఆటోను ఢీకొట్టిన లారీ.. ఆరుగురు దుర్మరణం

Six Killed In Road Accient. పార్వతీపురం మన్యం జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం

By Medi Samrat  Published on  22 Feb 2023 11:04 AM GMT
ఆటోను ఢీకొట్టిన లారీ.. ఆరుగురు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొమరాడ మండలం చోళపదం వద్ద ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. పెళ్లికి వెళ్లి తిరిగి ఆటోలో వస్తున్న సమయంలో చోళపదం వద్ద లారీ ఢీకొట్టింది. మరో ముగ్గురికి తీవ్ర తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story