Andrapradesh: ఘోర ప్రమాదం..క్వారీలో బండరాళ్లు మీద పడి ఆరుగురు మృతి
బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది
By Knakam Karthik
Andrapradesh: ఘోర ప్రమాదం..క్వారీలో బండరాళ్లు మీద పడి ఆరుగురు మృతి
బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. గ్రానైట్ క్వారీలో బండరాళ్లు మీద పడడంతో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. పదహారు మంది కార్మికులు క్వారీలో పని చేస్తుండగా అకస్మాత్తుగా బండరాళ్లు కిందపడ్డాయని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. దీంతో ఆరుగురు కార్మికులు రాళ్ల కింద పడి నలిగిపోయారని వివరించారు. చనిపోయిన వారంతా ఒడిశాకు చెందిన వారని అధికారులు వివరించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఇప్పటి వరకు 4 మృత దేహాలను వెలికి తీశారు. తీవ్రంగా గాయపడిన మరో 8 మంది కార్మికులను మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. క్వారీ యాజమాన్యం భద్రతా చర్యలు చేపట్టలేదని అధికారులు భావిస్తున్నారు. క్వారీ ప్రమాద ఘటనపై బాపట్ల జిల్లా కలెక్టర్, ఎస్పీ స్థానిక అధికారులతో మాట్లాడారు. సహాయక చర్యలు వేగవంతం సూచించారు.