Andhrapradesh: పవన్‌ కల్యాణ్‌ ఆఫీసు ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

అమరావతి: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ క్యాంప్‌ కార్యాలయం ఎదుట ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది.

By అంజి  Published on  25 Jun 2024 1:53 PM IST
suicide, Deputy CM Pawan Kalyan, APnews

Andhrapradesh: పవన్‌ కల్యాణ్‌ ఆఫీసు ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

అమరావతి: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ క్యాంప్‌ కార్యాలయం ఎదుట ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. తన భూమి కబ్జాకు గురికావడంతో తన గోడును చెప్పుకునేందుకు అమరావతిలోని పవన్‌ క్యాంప్ కార్యాలయానికి మహిళ వచ్చింది. అయితే పోలీసులు పవన్‌ను కలవకుండా అడ్డుకోవడంతో ఆమె సూసైడ్‌కు యత్నించింది. దీంతో ఆమెను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. రాజమండ్రిలో తన 1200 గజాల స్థలాన్ని వైసీపీ మహిళా కార్పొరేటర్‌ కబ్జా చేశారని మహిళ ఆరోపించింది. మహిళా కార్పొరేటర్‌ ఓ బ్రోకర్‌ను అడ్డు పెట్టుకుని తన భూమిని లాక్కున్నారని తెలిపింది.

దీని గురించి అధికారులను కలిసినా లాభం లేకుండాపోయిందని తెలిపింది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబును కలవాలని తన భర్తతో కలిసి ప్రయత్నించానని చెప్పింది. కానీ ముఖ్యమంత్రిని కలిసిందుకు పోలీసులు పర్మిషన్‌ ఇవ్వలేదని ఆ మహిళ వాపోయింది. అందుకే ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకోవాలని వచ్చినట్లు సదరు మహిళ తెలిపింది.

Next Story