అమెరికాలో రోడ్డు ప్రమాదం.. పాలకొల్లు దంపతులు మృతి

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంపతులు మృతి చెందారు.

By -  అంజి
Published on : 5 Jan 2026 12:44 PM IST

Telugu couple, Palakollu, West Godavari district died, road accident, United States

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. పాలకొల్లు దంపతులు మృతి

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంపతులు మృతి చెందారు. వాషింగ్టన్‌లో పదేళ్లుగా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్న కొటికలపూడి కృష్ణకిశోర్‌ (టిన్ను) (45), ఆయన భార్య ఆశా కన్నా (40) పిల్లలతో కలిసి కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దంపతులిద్దరూ మరణించగా, వారి కుమారుడు, కూతురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగానే ఉందని సమాచారం. కృష్ణ కిశోర్‌ కుటుంబం 10 రోజుల క్రితమే సెలవులు రావడంతో స్వగ్రామానికి వచ్చి వెళ్లింది. ఆ తర్వాత వారు దుబాయ్‌ వెళ్లారు. అక్కడ నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. అనంతరం అమెరికాకు చేరుకున్న కొద్ది రోజులకే ఈ విషాదకర ఘటన చోటుచేసుకోవడం కుటుంబ సభ్యులను, బంధువులను కలచివేసింది. ఈ ఘటనతో పాలకొల్లులో విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story