Andhrapradesh: చిన్నారిపై వీధి కుక్క దాడి.. వీడియో

కడప జిల్లాలోని కమలాపురం నగర పంచాయతీలో వీధి కుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. నాయి బ్రాహ్మణ వీధిలో ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారిపై ఓ వీధి కుక్క దాడి చేసింది.

By అంజి
Published on : 18 Sept 2024 10:08 AM IST

stray dog, ​​attack, child, Kamalapuram, Kadapa district

Andhrapradesh: చిన్నారిపై వీధి కుక్క దాడి.. వీడియో

కడప జిల్లాలోని కమలాపురం నగర పంచాయతీలో వీధి కుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. నాయి బ్రాహ్మణ వీధిలో ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారిపై ఓ వీధి కుక్క దాడి చేసింది. దీనికి సంబంధించిన సీసీటీవీ విజువల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాలుడు తన ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉండగా వీధి కుక్క ఒక్కసారిగా అతని మీదకు దూకి దాడి చేసింది. దీంతో బాలుడు గట్టిగా కేకలు వేశాడు. అయినా కూడా కుక్క.. బాలుడిని వదిలి పెట్టలేదు.

ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డ్‌ అయ్యాయి. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి కుక్కను తరిమి బాలుడిని కాపాడారు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే బాలుడిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలుడి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అంతకుముందు రోజు అంధుల కాలనీలో ఓ చిన్నారిపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. దీంతో వీధి కుక్కల స్వైర విహారానికి అడ్డుకట్ట వేయాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు.


Next Story