బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు..ఆరుగురు కార్మికులు సజీవదహనం

ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

By -  Knakam Karthik
Published on : 8 Oct 2025 2:45 PM IST

Andrapradesh,  BR Ambedkar Konaseema district, fireworks factory

బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు..ఆరుగురు కార్మికులు సజీవదహనం

ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాయవరంలోని గణపతి గ్రాండ్ బాణసంచా తయారీ కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదం ధాటికి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు కార్మికులు సజీవదహనమయ్యారు. మరికొందరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పేలుడు జరిగిన సమయంలో ఈ బాణసంచా తయారీ కేంద్రంలో 40 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు

సీఎం దిగ్భ్రాంతి

అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాద ఘటన కలిచివేసింది. ఈ ఘోర ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆవేదన కలిగించింది. ప్రమాద కారణాలు, ప్రస్తుత పరిస్థితి, సహాయక చర్యలు, వైద్య సాయంపై అధికారులతో మాట్లాడాను. స్వయంగా సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఉన్నతాధికారులను ఆదేశించాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని సూచించాను. బాధిత కుటుంబాలను ఆదుకుంటాం...అని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.

Next Story