బతికుండగానే మాజీ మంత్రి మరణ దిన వేడుకలు.. నెట్టింట వైరల్‌.!

A man from AP who celebrated his death day while he was still alive. ఆంధ్రప్రదేశ్‌లో ఓ మాజీ మంత్రి చేసిన పని.. ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ ఎంటీ

By అంజి  Published on  17 Dec 2022 12:09 PM IST
బతికుండగానే మాజీ మంత్రి మరణ దిన వేడుకలు.. నెట్టింట వైరల్‌.!

ఆంధ్రప్రదేశ్‌లో ఓ మాజీ మంత్రి చేసిన పని.. ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ ఎంటీ అనుకుంటున్నారా?.. ఆ మాజీ మంత్రి తనకు మరణం ఎప్పుడు వస్తుందో ఊహించుకుని.. బతికుండగానే ఆ రోజన ప్రతి సంవత్సరం వేడుక చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకు సంబంధించి ఇన్విటేషన్‌ కార్డులను కూడా ముద్రించుకున్నారు. ఈ వింత నిర్ణయంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. చీరాలకు చెందిన డాక్టర్‌ పాలేటి రామారావు ఈ నిర్ణయం తీసుకున్నారు.

''మొత్తం జీవించాలనుకున్నది 75 సంవత్సరాలు, ఇప్పటికి జీవించినది 63 సంవత్సరాలు, ఇంకా జీవించవలసినది 12 సంవత్సరాలు'' అంటూ తన మరణదినం ఆహ్వాన పత్రికను ముద్రించుకున్నారు. ఇవాళ చీరాల పట్టణంలో 12వ మరణదినం పేరిట వేడుకలకు సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది 11వ మరణ దిన వేడుకలు చేసుకుంటానని చెప్పారు. 2034వ సంవత్సరంలో చనిపోతానని అంచనా వేసుకుని మరణదినం జరుపుకుంటున్నానని చెప్పారు. టీడీపీ హయాంలో రామారావు రాష్ట్ర మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం 63 ఏళ్ల వయస్సు గల రామారావు.. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగానూ గెలిచారు.

ప్రస్తుతం మాజీ మంత్రి మరణదిన వేడుక ఆహ్వానపత్రికి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


Next Story