ఏపీలో కాస్త త‌గ్గిన క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే..?

97863 New corona cases reported in AP.ఏపీలో నిన్న‌టితో పోలిస్తే నేడు క‌రోనా కేసులు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Jun 2021 12:41 PM GMT
ఏపీలో కాస్త త‌గ్గిన క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే..?

ఏపీలో నిన్న‌టితో పోలిస్తే నేడు క‌రోనా కేసులు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 97,863 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 8,110 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 17,87,883కి చేరింది. నిన్న 12,981 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 16,77 ,063 కి పెరిగింది.

కోవిడ్ వల్ల చిత్తూర్ లో పదకొండు మంది, ప‌శ్చిమ గోదావరి లో తొమ్మిది, విశాఖపట్నంలో ఏడుగురు, శ్రీకాకుళం లో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, విజ‌య‌న‌గ‌రంలో ఆరుగురు, గుంటూరులో ఐదుగురు, క‌ర్నూల్‌లో ఐదుగురు, అనంత‌పూర్‌లో న‌లుగురు, కృష్ణ‌లో న‌లుగురు, క‌డ‌ప‌లో ముగ్గురు, నెల్లూరులో ఒక్క‌రు మొత్తం 67 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 11,763కి చేరింది. ఇక రాష్ట్రంలో 99,057 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 2,01,37,627 సాంపిల్స్ ని పరీక్షించారు.

Next Story