ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 33,876 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. అయిన‌ట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్ల‌డించింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,275కి చేరింది. వైరస్‌ బారినపడిన వారిలో 179 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 8,80,046 మంది ఈ మ‌హ‌మ్మారిని జ‌యించారు. కృష్ణా జిల్లాలో ఒకరు మృత్యువాత పడ‌గా.. మృతుల సంఖ్య 7,158కి చేరింది. ప్ర‌స్తుతం 1,071 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 1,32,76,678 శాంపిళ్లను పరీక్షించినట్లు వెల్లడించారు.తోట‌ వంశీ కుమార్‌

Next Story