ఏపీలో పెరిగిన క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నికేసులంటే..?

96 New corona cases in AP.ఏపీ‌లో కరోనా పాజిటివ్‌ కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Feb 2021 11:08 AM GMT
ఏపీలో పెరిగిన క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నికేసులంటే..?

ఏపీ‌లో కరోనా పాజిటివ్‌ కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 34,778 కరోనా పరీక్షలు నిర్వహించగా 96 పాజిటివ్ కేసులు నిర్థ‌రాణ అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య 8,89,681కి చేరింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 22 కేసులు నమోదు కాగా, ప్ర‌కాశం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 71 మంది కరోనా నుంచి కోలుకోగా.. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకున్నా వారి సంఖ్య 8,81,877కి చేరింది. గ‌డిచిన 24 గంట‌ల్లో ఒక‌రు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా మ‌ర‌ణించిన వారి సంఖ్య‌ 7,169కి చేరింది. కాగా.. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 1,38,77,968 న‌మూనాల‌ను ప‌రీక్షించిన‌ట్లు ప్ర‌భుత్వం బులెటిన్‌లో వెల్ల‌డించింది.

ఏ జిల్లాలో ఎన్నికేసులంటే..?

అనంత‌పురం -6

చిత్తూరు -22

తూర్పుగోదావ‌రి -7

గుంటూరు - 17

క‌డ‌ప -6

కృష్ణ - 9

క‌ర్నూలు -3

నెల్లూరు -9

ప్ర‌కాశం - 0

శ్రీకాకుళం - 4

విశాఖ‌ప‌ట్నం -5

విజ‌య‌న‌గ‌రం - 4

ప‌శ్చిమ‌గోదావ‌రి - 4






Next Story