ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 42,696 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 947 పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసులు 8,97,810కి చేరింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 180 కేసులు నమోదు కాగా.. విశాఖలో 156, గుంటూరులో 145 కొత్తగా పాజిటివ్ కేసులు రాగా.. అత్యల్పంగా పశ్చిమగోదావరిలో 18కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఒక్కరు కూడా కరోనా మహమ్మారితో ప్రాణాలు కోల్పోలేదు. నిన్న ఒక్క రోజే 377 మంది కరోనా నుంచి కోలుకోగా మొత్తంగా 8,85,892కి చేరింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 4,175 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 7,203 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,49,58,897 కరోనా శాంపిళ్లను పరీక్షించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది.