ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఈరోజు ఎన్నంటే..?
94 New corona cases in AP.ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.32,494 కరోనా పరీక్షలు నిర్వహించగా 94 పాజిటివ్ కేసులు నిర్థరాణ
By తోట వంశీ కుమార్ Published on
24 Feb 2021 12:11 PM GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 32,494 కరోనా పరీక్షలు నిర్వహించగా 94 పాజిటివ్ కేసులు నిర్థరాణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,89,503కి చేరింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 21 కేసులు నమోదు కాగా, ప్రకాశం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 66 మంది కరోనా నుంచి కోలుకోగా.. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నా వారి సంఖ్య 8,81,732కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 7,168కి చేరింది. కాగా.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,38,07,747 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో వెల్లడించింది.
Next Story