ఈ జిల్లాల్లో గిరిజనులకు త్వరలో 89,845 దోమ తెరల పంపిణీ

గిరిజనుల కుటుంబాల వారికి 89,845 దోమ తెరలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు

By -  Knakam Karthik
Published on : 27 Oct 2025 5:20 PM IST

Andrapradesh, Health Minister Satyakumar Yadav, mosquito nets, tribals

ఆ జిల్లాల్లోని గిరిజనులకు త్వరలో 89,845 దోమ తెరల పంపిణీ

అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఎంపికచేసిన గిరిజనుల కుటుంబాల వారికి 89,845 దోమ తెరలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. దోమల ద్వారా వచ్చే మలేరియా జ్వరాల వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా దోమ తెరలను ఎంపిక చేసిన గిరిజనుల కుటుంబాలకు ఇస్తామని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

గడిచిన 3 సంవత్సరాల్లో అధికంగా నమోదైన మలేరియా జ్వరాల కేసుల ప్రాతిపాదికన అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కలిపి, ఎంపికచేసిన 743 గ్రామల్లోని గిరిజనులకు వీటిని అందచేస్తామని తెలిపారు పార్వతీపురం మన్యం జిల్లాకు 26,338, అల్లూరి సీతారామరాజు జిల్లాకు 63,507 దోమ తెరలను పంపిణీ చేస్తామని తెలిపారు.

వీటి ద్వారా ఎంపికచేసిన సదరు కుటుంబాల్లో ఉన్న సుమారు 2 లక్షల మంది గిరిజనులు ప్రయోజనం పొందుతారని వెల్లడించారు. 89,845 దోమతెరల కొనుగోలుకు రూ.2.30 కోట్లు వరకు వ్యయం కావొచ్చునని అంచనా నెల రోజుల్లో గిరిజనులకు వీటిని అందచేయనున్నారు.

Next Story