ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య చాలా స్వల్పంగా పెరిగాయి. అయినప్పటికీ వందలోపు పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 12,208 పరీక్షలు నిర్వహించగా.. 88 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు గురువారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,18,705కి చేరింది. కరోనా కారణంగా నిన్న ఎవ్వరూ ప్రాణాలు కోల్పోలేదు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి నేటి వరకు 14,729 మంది మరణించారు. 24 గంటల వ్యవధిలో 97 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 23,03,227కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 749 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,32,25,212 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.