నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో కలకలం.. 800 మంది విద్యార్థులకు అస్వస్థత

ఏలూరు జిల్లాలోని నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో కలకలం చెలరేగింది. నిన్న ఒక్క రోజే 342 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

By అంజి  Published on  28 Aug 2024 12:44 PM IST
students sick, Nujiveedu IIIT, APnews

నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో కలకలం.. 800 మంది విద్యార్థులకు అస్వస్థత

ఏలూరు జిల్లాలోని నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో కలకలం చెలరేగింది. నిన్న ఒక్క రోజే 342 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మూడు రోజుల్లో 800 మంది అనారోగ్యం పాలయ్యారు. జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల అనారోగ్యానికి కారణాలు తెలుసుకోవడానికి కమిటీ వేశామని అధికారులు చెబుతున్నారు.

ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్‌ స్పందించారు. ''నూజివీడు ట్రిపుల్ ఐటీలో గత 3 రోజులుగా విద్యార్థులు పెద్దఎత్తున అనారోగ్యానికి గురయ్యారన్న వార్త నన్ను ఆందోళనకు గురిచేసింది. దీనిపై తక్షణమే స్పందించి విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాల్సిందిగా అధికారులను అదేశించాను. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు. ఇటువంటివి పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత అధికారులపై ఉంది'' అని అన్నారు.

Next Story