ఏపీలో త‌గ్గిన క‌రోనా కేసులు.. ఈరోజు ఎన్నికేసులంటే..?

75 New corona cases in AP.నిన్న‌టితో పోలిస్తే నేడు క‌రోనా కేసులు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Feb 2021 6:24 PM IST
ఏపీలో త‌గ్గిన క‌రోనా కేసులు.. ఈరోజు ఎన్నికేసులంటే..?

ఏపీలో నిన్న‌టితో పోలిస్తే నేడు క‌రోనా కేసులు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 34,864 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌గా 75 మందికి పాజిటివ్‌గా నిర్థార‌ణ అయిన‌ట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్ల‌డించింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,350కి చేరింది. నిన్న ఒక్క రోజే 133 మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 8, 80,179కి చేరింది. విశాఖ‌లో ఒక‌రు మ‌ర‌ణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌మ‌మ్మారి భారిన ప‌డి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7,159కి చేరింది. ప్ర‌స్తుతం 1,012 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 1,33,11,542 క‌రోనా శాంపిళ్ల‌ను పరీక్షించిన‌ట్లు బులెటిన్‌లో వెల్ల‌డించారు.



Next Story