ఏపీ క‌రోనా అప్‌డేట్‌.. భారీగా త‌గ్గిన కేసులు

739 New Covid-19 cases reported in Andhra pradesh.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. అయితే..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Sep 2021 12:37 PM GMT
ఏపీ క‌రోనా అప్‌డేట్‌.. భారీగా త‌గ్గిన కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. అయితే.. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య భారీగా త‌గ్గుముఖం ప‌ట్టింది. గ‌డిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 43,594 పరీక్షలు నిర్వహించగా.. 739 కేసులు నిర్ధారణ అయిన‌ట్లు సోమ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,22,064కి చేరింది. నిన్న కొవిడ్ వ‌ల్ల చిత్తూరులో న‌లుగురు, ప్ర‌కాశంలో న‌లుగురు, కృష్ణ‌లో ఇద్ద‌రు, నెల్లూరులో ఇద్ద‌రు, అనంత‌పూర్‌లో ఒక్క‌రు, తూర్పుగోదావ‌రిలో ఒక్క‌రు చొప్పున మొత్తం 14 ప్రాణాలు కోల్పోయారు.

రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా 13,925 మంది మ‌ర‌ణించారు. 24 గంటల వ్యవధిలో 1,333 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,93,589కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,550 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,69,82,681 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

Next Story
Share it