ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో 33,980 మందికి కరోనా పరీక్షలు చేయగా 73 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,423కి చేరింది. నిన్న ఒక్క రోజే 82 మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 8, 80,261కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ మమమ్మారి భారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7,159కి చేరింది. ప్రస్తుతం 1,003 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,33,45,522 కరోనా శాంపిళ్లను పరీక్షించినట్లు బులెటిన్‌లో వెల్లడించారు.