ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 28,239 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 67 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో 8,89,077కి చేరింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 17 కేసులు నిర్ధారణ అయ్యాయి. కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇదే సమయంలో 54 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 8,81,292 చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 7,166 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 619 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,36,44,086 కరోనా శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.