ఏపీ క‌రోనా అప్‌డేట్‌.. కొత్త‌గా ఎన్నికేసులంటే..?

60 N‌ew Corona cases in AP.ఏపీలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరిగాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 24,311 క‌రోనా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Feb 2021 1:42 PM GMT
ఏపీ క‌రోనా అప్‌డేట్‌.. కొత్త‌గా ఎన్నికేసులంటే..?

ఏపీలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరిగాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 24,311 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 60 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 8,89,959కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఎలాంటి మరణం సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 7,163 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 615 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 1,35,89,373 క‌రోనా శాంపుల్స్‌ని ప‌రీక్షించిన‌ట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు.Next Story
Share it