ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నికేసులంటే..?
492 New corona cases in ap.గడిచిన 24 గంటల్లో 33,634 కరోనా పరీక్షలు నిర్వహించగా 492 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది.
By తోట వంశీ కుమార్ Published on
23 March 2021 12:52 PM GMT

గత కొద్ది రోజులుగా ఏపీలో చాలా తక్కువ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా.. నేడు కేసుల సంఖ్య భారీగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో 33,634 కరోనా పరీక్షలు నిర్వహించగా 492 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,94,536కి చేరింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 168 కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో 256 మంది కరోనా నుంచి కోలుకోగా.. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నా వారి సంఖ్య 8,84,727కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,616 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. దీంతో ఈ మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 7,193కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,48,05,335 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో వెల్లడించింది.
Next Story