ఏపీ క‌రోనా అప్‌డేట్‌.. భారీగా త‌గ్గిన కేసులు

46 New covid-19 cases reported in Andhra Pradesh.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. గ‌త కొద్ది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 March 2022 12:36 PM GMT
ఏపీ క‌రోనా అప్‌డేట్‌.. భారీగా త‌గ్గిన కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. గ‌త కొద్ది రోజులుగా వంద లోపే పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 12,092 పరీక్షలు నిర్వహించగా.. 46 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు శుక్ర‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,18,751కి చేరింది. క‌రోనా కార‌ణంగా నిన్న ఎవ్వ‌రూ ప్రాణాలు కోల్పోలేదు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి నేటి వ‌ర‌కు 14,729 మంది మ‌ర‌ణించారు. 24 గంటల వ్యవధిలో 134 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 23,03,361కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 661 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,32,37,304 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

Next Story