ఏపీలో భారీగా పెరిగిన క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు

4157 New Corona Cases In AP. ఏపీలో గ‌డిచిన 24 గంట‌ల్లో 35,732 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 4,157 పాజిటివ్ కేసులు న‌మోదు

By Medi Samrat  Published on  14 April 2021 6:27 PM IST
corona virus

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కరోనా మ‌హ‌మ్మారి తీవ్ర‌రూపం దాల్చింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 35,732 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 4,157 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ తాజా బులిటెన్‌లో వెల్ల‌డించింది. అత్య‌ధికంగా, తూర్పుగోదావ‌రి జిల్లాలో 617, చిత్తూరు జిల్లాలో 517 కేసులు న‌మోదు కాగా.. ఆ త‌రువాత శ్రీకాకుళం జిల్లాలో 522, విశాఖ జిల్లాలో 417 పాజిటివ్ కేసుల‌ను గుర్తించారు. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 9,37,049 కి చేరింది. నిన్న ఒక్క రోజే క‌రోనాతో 18 మంది ప్రాణాలు కోల్పోయారు.

దీంతో ఈమ‌హ‌మ్మారి కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు మృత్యువాత ప‌డిన వారి సంఖ్య 7,339కి చేరింది. నిన్న ఒక్క రోజే 1,606 కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,01,327కి చేరింది. కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 1,55,34,460 న‌మూనాల‌ను ప‌రీక్షించిన‌ట్లు బులిటెన్‌లో వెల్ల‌డించారు.


Next Story