ఆంధ్రప్రదేశ్‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 51,420 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 377 కొత్త కేసులు న‌మోదు అయిన‌ట్లు ఆరోగ్య శాఖ తాజాగా విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో న‌మోదు అయిన మొత్తం కేసుల సంఖ్య 8,83,587కి చేరింది. మొత్తం న‌మోదు అయిన కేసుల్లో 8,73,427 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా.. 3,038 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కొత్తగా నాలుగు మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 7122కి చేరింది. రాష్ట్రంలో 1,20,53,914 క‌రోనా సాంపిల్స్‌ని ప‌రీక్షించారు.
తోట‌ వంశీ కుమార్‌

Next Story