ఆంధ్రప్రదేశ్ కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చింది. గడిచిన 24 గంటల్లో 33,755 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 3,263 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 654 కేసులు నమోదు కాగా.. ఆ తరువాత గుంటూరు జిల్లాలో 418, విశాఖ జిల్లాలో 454 పాజిటివ్ కేసులను గుర్తించారు. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 9,28,664 కి చేరింది. నిన్న ఒక్క రోజే కరోనాతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
దీంతో ఈమహమ్మారి కారణంగా ఇప్పటి వరకు మృత్యువాత పడిన వారి సంఖ్య 7,311కి చేరింది. నిన్న ఒక్క రోజే 1,091 కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 8,98,238కి చేరింది. కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,54,63,146 నమూనాలను పరీక్షించినట్లు బులిటెన్‌లో వెల్లడించారు.