ఏపీలో గడచిన 24 గంటల్లో 59,671 కరోనా పరీక్షలు నిర్వహించగా 319 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ బులెటిన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన కేసుల సంఖ్య మొత్తం 8,84,490కి చేరింది. కొవిడ్ వ‌ల్ల కృష్ణ‌లో ఒక్క‌రు మ‌ర‌ణించారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 7,127 మంది క‌రోనాతో మృతి చెందారు. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 46 కేసులు, చిత్తూరు జిల్లాలో 44 కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 5, ప్రకాశం జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి.


నిన్న 308 మంది కరోనా నుంచి కోలుకోగా.. రాష్ట్రంలో కోలుకున్న‌వారి సంఖ్య 8,74,531కి చేరింది. ప్ర‌స్తుతం 2,832 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 1,22,24,202 క‌రోనా శాంపిల్స్‌ని ప‌రీక్షించారు.

తోట‌ వంశీ కుమార్‌

Next Story