ఘోర ప్ర‌మాదం.. నాప‌రాళ్ల కింద న‌లిగిన బ‌తుకులు

3 Workers Died in Road Accident in Palnadu district.ఆదివారం ఉద‌యం ప‌ల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Sept 2022 11:52 AM IST
ఘోర ప్ర‌మాదం.. నాప‌రాళ్ల కింద న‌లిగిన బ‌తుకులు

ఆదివారం ఉద‌యం ప‌ల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. లారీ అదుపు త‌ప్పి బోల్తా ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు దుర్మ‌ర‌ణం చెందారు.

మాచ‌ర్ల నుంచి భీమ‌వ‌రంకు నాపరాళ్ళు లోడుతో లారీ వెలుతోంది. ప‌ల్నాడు జిల్లా శాంతిన‌గ‌ర్ వ‌ద్దకు వ‌చ్చే స‌రికి లారీ అదుపు త‌ప్పి బోల్తా ప‌డింది. ముగ్గురు కూలీల‌పై నాప‌రాళ్లు ప‌డ‌డంతో అక్క‌డిక‌క్క‌డే వారు ప్రాణాలు కోల్పోయారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. మృతుల‌ను పసర్లపాడుకు చెందిన అమారేసు శ్రీను, దొడ్డ భాస్కరరావు, రమావత్ మునినాయక్‌గా గుర్తించారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం న‌ర‌స‌రావు పేట ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దీనిపై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ అక్కడి నుంచి ప‌రారు అయ్యాడు.

Next Story