ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 90,532 శాంపిళ్లను పరీక్షించగా.. 2,930 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 18,99,748కి చేరింది. నిన్న 4,346 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,51,062కి పెరిగింది.
కోవిడ్ వల్ల చిత్తూరులో ఆరుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, గుంటూరులో నలుగురు, కర్నూల్‌లో నలుగురు, కడపలో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, అనంతపూర్‌లో ఇద్దరు, కృష్ణలో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, నెల్లూరులో ఒక్కరు, విజయనగరంలో ఒక్కరు చొప్పున మొత్తం 36 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 12,815కి చేరింది. ఇక రాష్ట్రంలో 37,871 యాక్టివ్ కేసులు ఉండగా.. నేటి వరకు రాష్ట్రంలో 2,22,68,483 సాంపిల్స్ ని పరీక్షించారు.