ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 30,716 కరోనా పరీక్షలు నిర్వహించగా 253పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,92,522కి చేరింది. అత్యధికంగా చిత్తూరు గుంటూరు జిల్లాలో 69 కొత్త కేసులు నమోదు కాగా చిత్తూరు జిల్లాలో 39, తూర్పుగోదావరి జిల్లాలో 29 కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో 137 మంది కరోనా నుంచి కోలుకోగా.. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నా వారి సంఖ్య 8,83,642కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,694 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 7,186కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,46,11,499 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో వెల్లడించింది.