ఉడికి ఉడకని అన్నం తిని.. 25 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఏపీలో వరుస ఘటనలు

25 students take ill due to stale food in AP Govt school. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కింద పాఠశాల అధికారులు

By అంజి  Published on  26 Nov 2022 7:11 AM GMT
ఉడికి ఉడకని అన్నం తిని.. 25 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఏపీలో వరుస ఘటనలు

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కింద పాఠశాల అధికారులు సరఫరా చేసిన భోజనంతో కనీసం 25 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన జిల్లా కదిరి పట్టణంలోని మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. 148 మంది పిల్లల్లో 121 మంది శుక్రవారం తరగతులకు హాజరయ్యారు. తమకు వడ్డించే ఆహారం నాసిరకంగా మారిందని విద్యార్థులు వాపోయారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ లావణ్య విద్యార్థులకు తాజా ఆహారాన్ని సరఫరా చేయాలని క్యాటరింగ్ ఏజెన్సీని కోరారు.

దీంతో ఆమె భోజనం తిరిగి వండాలని భోజన ఏజెన్సీ నిర్వాకులకు సూచించారు. దాంతో వారు భోజనం ఉడక్క ముందే దించేంసి పిల్లలకు వడ్డించారు. దీంతో కనీసం 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బాధిత విద్యార్థులు వాంతులు, కడుపు నొప్పితో బాధపడుతున్నారు. తొలుత ఎనిమిది మంది విద్యార్థులను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మరో 17 మంది విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎస్వీ కృష్ణా రెడ్డి ఆసుపత్రిని సందర్శించి విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వివరించారు.

విద్యార్థులకు నాసిరకం భోజనం అందించడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. విచారణ జరిపి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారి హామీ ఇచ్చారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. జగనన్న గోరుముద్ద పేరుతో మధ్యాహ్న భోజన పథకం కింద కొత్త మెనూని నవంబర్ 21 న ప్రవేశపెట్టారు. విద్యార్థులలో శారీరక దృఢత్వాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం మెనూను మార్చింది. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు గతంలో కంటే మెరుగైన పౌష్టికాహారం అందిస్తున్నామని అధికారులు తెలిపారు.

కొత్త నిబంధనల ప్రకారం, మధ్యాహ్న భోజన ఏజెన్సీలు అన్నం, కూరగాయల కూర, పప్పు సాంబార్, కోడిగుడ్డు కూర, చట్నీ మొదలైనవాటిని అందించాలి. లబ్ధిదారుల విద్యార్థులకు వారానికి కనీసం మూడు ఉడికించిన గుడ్లు అందించాలి. గత నెలరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యంగా రెసిడెన్షియల్ పాఠశాలల్లో పాఠశాల అధికారులు సరఫరా చేసే ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి. కాంట్రాక్టు ఇచ్చిన క్యాటరింగ్ ఏజెన్సీలు తయారు చేస్తున్న ఆహార పదార్థాల నాణ్యత తక్కువగా ఉండడం, ఆహారాన్ని వండేటప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇందుకు కారణమని తెలుస్తోంది.

Next Story