ఏపీ క‌రోనా బులిటెన్ విడుద‌ల‌.. భారీగా న‌మోదైన కేసులు, మ‌ర‌ణాలు

24171 New Corona Cases Reported In AP. ఏపీలో గ‌డిచిన 24 గంట‌ల్లో 94,550 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 24,171 పాజిటివ్ కేసులు న‌మోదు

By Medi Samrat  Published on  16 May 2021 5:49 PM IST
corona cases in AP today

ఏపీలో క‌రోనా విల‌యం కొనసాగుతూనే ఉంది. గ‌త కొద్ది రోజులుగా నిత్యం 20వేల‌కు పైనే పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 94,550 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 24,171 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 14,35,491కి చేరింది. నిన్న 21,101 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 12,15,683కి పెరిగింది.

కోవిడ్ వల్ల అనంతపూర్ లో పద్నాలుగు మంది, విశాఖపట్నం లో పదకొండు మంది, చిత్తూర్ లో పది మంది, తూర్పు గోదావరి లో తొమ్మిది, గుంటూరు లో తొమ్మిది, కృష్ణలో తొమ్మిది, విజయనగరం లో తొమ్మిది, నెల్లూరు లో ఏడుగురు, కర్నూల్ లో ఆరుగురు, ప్రకాశం లో ఆరుగురు, శ్రీకాకుళం లో ఆరుగురు, పశ్చిమ గోదావరి లో ముగ్గురు, వైఎస్ఆర్ కడపలో ఇద్దరు చొప్పున మొత్తం 101 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 9,372కి చేరింది. ఇక రాష్ట్రంలో 2,10,436 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 1,79,75,305 సాంపిల్స్ ని పరీక్షించారు.




Next Story