ఏపీలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,14,299 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 23,920 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా బులిటెన్ లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో న‌మోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 11,45,022కి చేరింది. రాష్ట్రంలో అత్య‌ధికంగా చిత్తూరులో 2,945 మంది, విజ‌య‌న‌గ‌రంలో అత్య‌ల్పంగా 849 మంది క‌రోనా బారిన ప‌డ్డారు.

నిన్న ఒక్క‌రోజే రాష్ట్ర వ్యాప్తంగా 83 మంది క‌రోనా కార‌ణంగా మరణించారు. దీంతో మ‌హ‌మ్మారి రాష్ట్రంలో మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మృతి చెందిన వారి సంఖ్య 8,136కి చేరింది. నిన్న 11,411 మంది కోలుకోగా.. మొత్తంగా క‌రోనా బారి నుంచి బ‌య‌ట‌ప‌డిన వారి సంఖ్య 9,93,708కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 1,43,178 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ రాష్ట్రంలో 1,66,02,873 సాంఫిల్స్‌ను ప‌రిక్షించారు.


సామ్రాట్

Next Story