ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 31,165 కరోనా పరీక్షలు నిర్వహించగా 218 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,92,740కి చేరింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 63 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 117 మంది కరోనా నుంచి కోలుకోగా.. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నా వారి సంఖ్య 8,83,759కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,795 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఎవరు ప్రాణాలు కోల్పోలేదు. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు మృతి చెందిన 7,185 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,46,42,664 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో వెల్లడించింది.