సీజేఐకి కోడికత్తి నిందితుడి తల్లి లేఖ
2018 Attack on Jagan Accused's mother writes to CJI seeking bail for son.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్
By తోట వంశీ కుమార్ Published on 10 July 2022 4:21 AM GMTవిజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో 2018లో దాడికి పాల్పడిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జానిపల్లి శ్రీనివాస్ కి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ అతడి తల్లి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణకు లేఖ రాశారు. నాలుగేళ్లుగా తన కుమారుడు రిమాండ్ ఖైదీగానే కొనసాగుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం, ఎన్‌ఐఏ ఎలాంటి విచారణ జరపడం లేదని లేఖలో సావిత్రి పేర్కొన్నారు.
2018లో విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సమయంలో హైదరాబాద్‌కు వెళ్లేందుకు జగన్ విశాఖపట్నం ఎయిర్‌కు వచ్చారు. అక్కడ ఓ యువకుడు కోడిపందాల్లో వాడే కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో జగన్ ఎడమ చేతికి గాయమైంది. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. విమానాశ్రయంలో పని చేస్తున్న వెయిటర్ శ్రీనివాస్ అనే యువకుడు ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అప్పటి నుంచి రిమాండ్ ఖైదీగా శ్రీనివాస రావు జైలులో మగ్గుతున్నాడు.
ఈ కేసును ఎన్ఐఏ విచారణ చేపట్టింది. అప్పటి అధికార పార్టీ టీడీపీయే జగన్ పై దాడి చేయించిందని వైసీపీ, ఎన్నికల్లో సింపతీ కోసమే వైసీపీ ఈడ్రామా ఆడిందని టీడీపీ ఒకరి నొకరు విమర్శించుకున్నాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపొంది అధికారాన్ని చేజిక్కుంచుకుంది.