ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 38,323 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 172 పాజిటివ్ కేసులు నిర్థార‌ణ అయిన‌ట్లు హెల్త్ బులెటిన్‌లో వెల్ల‌డించారు. దీంతో రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 8,87,238కి చేరింది. ఒక్క రోజు వ్య‌వ‌ధిలో రాష్ట్రంలో 203 మంది పూర్తి కోలుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,78,731కి చేరింది. గ‌డిచిన 24గంట‌ల్లో ఒక‌రు ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 7,150కి చేరింది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 1,29,42,153 క‌రోనా శాంపిల్స్ ప‌రీక్షించారు.

తోట‌ వంశీ కుమార్‌

Next Story