శ్రీకాకుళం వీరఘట్టంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఘాజీవీధికి చెందిన ఓ బాలుడు తన ప్రియురాలిని తీసుకురావాలని మొబైల్ ఫోన్ టవర్ ఎక్కాడు. వివరాల్లోకి వెళితే.. వీరఘట్టం నుంచి విశాఖపట్నంకు 16 ఏళ్ల బాలుడు కూరగాయల వాహనాలకు క్లీనర్‌గా వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో ఏడాది క్రితం విశాఖపట్నంలో 19 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడింది. వారం రోజుల క్రితం బాలుడు బాలికను వీరఘట్టానికి తీసుకువచ్చాడు. బాలిక తల్లిదండ్రులు గురువారం వీరఘట్టం వచ్చి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ఇద్దరినీ పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.
వెంటనే బాలిక తల్లిదండ్రులతో కలిసి విశాఖపట్నం వెళ్లిపోయింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని బాలుడు సాయంత్రం 5 గంటల సమయంలో వీరఘట్టంలో సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. బాలికను తీసుకురాకపోతే బాలుడు టవర్ పై నుంచి దూకేస్తానంటూ బెదిరిస్తున్నాడని స్థానికులు వీరఘట్టం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, పాలకొండ ఫైర్ సిబ్బంది టవర్ వద్దకు చేరుకుని బాలుడితో మాట్లాడి రాత్రి 8 గంటల ప్రాంతంలో టవర్ పై నుంచి కిందకు తీసుకొచ్చారు.