ఏపీలో 16 మంది ఐపీఎస్‌లు బదిలీ
16 IPS Officers Transferred in Andhra Pradesh state.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16మంది ఐపీఎస్ అధికారులు
By తోట వంశీ కుమార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. విజయనగరం, నెల్లూరు, తూ.గో, కృష్ణా జిల్లాల ఎస్పీల బదిలీలు అయ్యారు. పదోన్నతిపై దిశ డీఐజీగా బి.రాజకుమారి నియామకం కాగా.. విజయనగరం ఎస్పీగా ఎం.దీపిక బదిలీ అయ్యారు. ఈ మేరకు మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి.
అధికారి - ప్రస్తుత స్థానం - బదిలీ అయిన స్థానం
1.బి.రాజకుమారి - ఎస్పీ, విజయనగరం - డిఐజీ, దిశ, మంగళగిరి
2.ఎం.దీపిక- ఎస్పీ, దిశ - ఎస్పీ, విజయనగరం
3.సీ.హెచ్.విజయరావు - ఎస్పీ, విజయవాడ రైల్వే- ఎస్పీ నెల్లూరు
4.ఎం.రవీంద్రనాథ్ బాబు - ఎస్పీ, కృష్ణా- ఎస్పీ, తూర్పుగోదావరి
5.అద్నాన్ నయీం అస్మీ - ఎస్పీ, తూర్పుగోదావరి- గ్రూప్ కమాండర్, గ్రేహౌండ్స్
6.సిద్దార్థ కౌశల్ - ఎస్పీ, ప్రకాశం - ఎస్పీ కృష్ణా
7.వై.రిషాంత్ రెడ్డి - ఏఎస్పీ,ఎస్ఈబీ, చిత్తూరు - ఏఎస్పీ, అడ్మిన్, గుంటూరు రూరల్
8.ఎస్.సతీష్‌కుమార్ - ఓఎస్డీ, నర్సీపట్నం - ఏఎస్పీ,ఎస్ఈబీ
9.వి.విద్యాసాగర్ నాయుడు - ఏఎస్పీ, చింతపల్లి - ఏఎస్పీ, ఎస్ఈబీ
10.జి.బిందుమాధవ్ - ఏఎస్పీ, రంపచోడవరం - ఏఎస్పీ, ఎస్ఈబీ
11.తుహిన్ సిన్హా - ఏఎస్పీ, నర్సీపట్నం - ఏఎస్పీ, ఎస్ఈబీ
12.పి.జగదీష్ - అసాల్ట్ కమాండర్, గ్రేహౌండ్స్ - ఏఎస్పీ, పాడేరు
13.జి.కృష్ణకాంత్ - అసాల్ట్ కమాండర్, గ్రేహౌండ్స్ - ఏఎస్పీ, చింతూరు
14.వి.ఎన్.మణికంఠ చందోలు - అసాల్ట్ కమాండర్,గ్రేహౌండ్స్ - ఏఎస్పీ, నర్సీపట్నం
15.కృష్ణకాంత్ పటేల్ - అసాల్ట్ కమాండర్,గ్రేహౌండ్స్ - ఏఎస్పీ రంపచోడవరం
16.తుషార్ దూడి - అసాల్ట్ కమాండర్,గ్రేహౌండ్స్ - ఏఎస్పీ, చింతపల్లి