ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో గడిచిన 24 గంటల్లో 36,970 కరోనా పరీక్షలు నిర్వహించగా 135 పాజిటివ్ కేసులు నిర్థ‌రాణ అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య 8,90,215కి చేరింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 31 పాజిటివ్ కేసులు రాగా, విశాఖ జిల్లాలో 23 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 15, శ్రీకాకుళం జిల్లాలో 12, అనంతపురం జిల్లాలో 11, కర్నూలు జిల్లాలో 10 కేసులు గుర్తించారు. ప్రకాశం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 82 మంది కరోనా నుంచి కోలుకోగా.. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకున్నా వారి సంఖ్య 8,82,219కి చేరింది. గ‌డిచిన 24 గంట‌ల్లో ఒక‌రు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7,170కి చేరింది. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 1,40,47,174 న‌మూనాల‌ను ప‌రీక్షించిన‌ట్లు ప్ర‌భుత్వం బులెటిన్‌లో వెల్ల‌డించింది.

తోట‌ వంశీ కుమార్‌

Next Story